Share News

కప్పట్రాళ్ల విద్యార్థినికి సన్మానం

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:44 AM

కప్పట్రాళ్ల గ్రామంలోని పేద విద్యార్థిని (మైమూన్‌) మొదటి విడతలోనే తిరుపతిలోని వెంకటేశ్వర అగ్రికల్చర్‌ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో అర్హత సాదించింది.

కప్పట్రాళ్ల విద్యార్థినికి సన్మానం
విద్యార్థిని సన్మానిస్తున్న రవికృష్ణ

కర్నూలు క్రైం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కప్పట్రాళ్ల గ్రామంలోని పేద విద్యార్థిని (మైమూన్‌) మొదటి విడతలోనే తిరుపతిలోని వెంకటేశ్వర అగ్రికల్చర్‌ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో అర్హత సాదించింది. ఈ సందర్బంగా కప్పట్రాళ్ల గ్రామాన్నిదత్త తీసుకున్న నాటి ఎస్పీ, ఈగల్‌ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఏపీ రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి డా.డి.ప్రవీణ్‌ బుధవారం గుంటూరులో సన్మానించి అభినందించారు. ఆకే రవికృష్ణ సహకారంతో నిరంతరం ప్రోత్సాహం, సలహాలు, సూచనలు పాటిం చడం ద్వారా ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధ్యమైందని విద్యార్థిని మైమూన్‌ తెలిపారు. తానా బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ పోట్లూరి రవి విద్యార్థిని మైమూ న్‌ను ఫీజులు కట్టి ఇంటర్‌ చదివించారు. ఈ సందర్బంగా ఇంటర్‌లో మంచి మార్కులతో మైమూన్‌ ఉత్తీర్ణత సాధించారు. ఈ ట్రస్టు కప్పట్రాళ్ల గ్రామంలోని 5 మంది విద్యార్థులకు ఫీజులు కట్టి చదివిస్తున్నారు. ఏవో అక్బర్‌ బాషా, విద్యార్థిని తల్లి పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:44 AM