భద్రతపై హోం మంత్రి ఆరా
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:42 PM
ప్రధాన మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత మంగళవారం కర్నూలు వచ్చారు.
కర్నూలు క్రైం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత మంగళవారం కర్నూలు వచ్చారు. ఆమెతో పాటు మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా కర్నూలుకు చేరుకున్నారు. నన్నూరు రాగమయూరిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో భద్రతా చర్యలపై ఆరాతీశారు. ఉన్నతాస్థాయి అధికారులతో చర్చించారు. భద్రతా వ్యవస్థల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, కమ్యూనికేషన్, ప్రజా సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. డీఐజీ సత్య యేసుబాబు, డీఎస్పీ భావన ఉన్నారు.