Share News

హాకీ శతాబ్ది పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:39 AM

: స్థానిక అవుట్‌డోర్‌ స్టేడియంలో శుక్రవారం మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ హాజరై హాకీ శతాబ్ది పోటీలు ప్రారంభించారు. ధ్యాన్‌ చంద్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. యువత క్రీడలు, ఆరోగ్యంపై దృష్టి సారించాలని తెలిపారు

హాకీ శతాబ్ది పోటీలు ప్రారంభం
మాట్లాడుతున్న మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌

కర్నూలు స్పోర్ట్స్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక అవుట్‌డోర్‌ స్టేడియంలో శుక్రవారం మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ హాజరై హాకీ శతాబ్ది పోటీలు ప్రారంభించారు. ధ్యాన్‌ చంద్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. యువత క్రీడలు, ఆరోగ్యంపై దృష్టి సారించాలని తెలిపారు. వంద సంవత్సరాల్లో హాకీ క్రీడ ఒలంపిక్‌లో బంగారు పతకాలు, ఏసియా, కప్పుల వలన వన్నె తెచ్చిందన్నారు. క్రీడాకా రులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో చురుగ్గా రాణించాలని రాష్ట్రానికి, జిల్లాకు పేరు తీసుకురా వాలని కోరారు. హాకీ కార్యదర్శి దాసరి సుధీర్‌ మాట్లాడుతూ శతాబ్ధి ఉత్సవాల్లో ర్లాయీలు, రక్తధాన శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒలింపిక్‌ సంఘః అద్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు మాజీ క్రీడాకారులు పుల్లయ్య, వెంకట్రావు, శాంతి ప్రసాద్‌ను సత్కరించారు. ఈ పోటీలోఎ్ల ఆరు బాలుర జట్లు, నాలుగు బాలికల జట్లు పాల్గొన్నాయి. ప్రవీణ్‌, అరుణ్‌, రవికుమార్‌, వీరేష్‌, మనోహర్‌, మహేష్‌, ఖలీల్‌, భరత్‌, పెద్దయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 12:39 AM