Share News

హాకీ విజేత మున్సిపల్‌ హైస్కూల్‌ జట్టు

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:18 AM

భారతదేశంలో హాకీ శతాబ్ది క్రీడాల్లో బాలుర విభాగంలో మున్సిపల్‌ హై స్కూల్‌ మెయిన్‌ జట్టు విజేతగా నిలిచింది.

హాకీ విజేత మున్సిపల్‌ హైస్కూల్‌ జట్టు
హాకీ విజేత మున్సిపల్‌ హై స్కూల్‌ జట్టుతో అతిథులు

కర్నూలు స్పోర్ట్స్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో హాకీ శతాబ్ది క్రీడాల్లో బాలుర విభాగంలో మున్సిపల్‌ హై స్కూల్‌ మెయిన్‌ జట్టు విజేతగా నిలిచింది. శనివారం అవుట్‌డోర్‌ స్టేడియంలో పైనల్‌ పోటీల్లో మాంటి ఇంగ్లీష్‌ మీడియం స్కూలు జట్టు పై 1-0 తేడాతో గెలుపొందింది. విజేతలకు జిల్లా ఒలంపిక్‌ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుదీర్‌, పవర్‌ లిఫ్టు సెక్రటరీ వేణుగోపాల్‌, హాకీ సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ అరుణ్‌, రవికుమార్‌, మహేష్‌, మనోహర్‌, వీరేష్‌, పెద్దయ్య, ఖలీల్‌ తదితరులు అభినందించి ట్రోఫీని అందజేశారు.

Updated Date - Nov 09 , 2025 | 12:18 AM