పంట మార్పిడితో అధిక దిగుబడులు
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:26 AM
పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వనరుల కేంద్రం డీడీఏ చెన్నయ్య అన్నారు.
దొర్నిపాడు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వనరుల కేంద్రం డీడీఏ చెన్నయ్య అన్నారు. మంగళవారం మండలంలోని క్రిష్టిపాడు గ్రామం లో ఏవో ప్రమీల ఆధ్వర్యంలో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం డీడీఏ చెన్నయ్య, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి హేమసుందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వాడాలని అన్నారు. ఒకే పొలంలో ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలు సాగు చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. రైతులు పొలాల్లో నీటి కుంటలు తవ్వుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఈవోలు, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.