బిందు సేద్యంతో అధిక దిగుబడి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:18 AM
బిందు సేద్యంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన శాఖాధికారి నాగ రాజు అన్నారు.
డోన రూరల్ నవంబరు 14(ఆంధ్రజ్యోతి): బిందు సేద్యంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన శాఖాధికారి నాగ రాజు అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఉల్లి పంట సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుమునుపు తిమ్మాపురం పరిసరాల్లో ఉన్న పంటలను ఉద్యాన జిల్లా అధికారి నాగరాజు పరిశీలించారు. అనంతరం డోన ఉద్యానశాఖ అధికారి కళ్యాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సద స్సులో మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించివచ్చన్నారు. అలాగే మహానంది నుంచి ఉద్యాన పరిశోధన స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్టు ఠాగూర్ నాయక్ మా ట్లాడుతూ ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ గురించి వివరిం చారు. కార్యక్రమంలో రైతు సేవా సిబ్బంది పాల్గొన్నారు.