సంప్రదాయ పంటల సాగుతో అభివృద్ధి
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:07 AM
): సంప్రదాయ పంటల సాగుతోనే రైతులు అభివృద్ది చెందగలరని శాస్త్రవేత్తలు చందన, సుజాత, మౌనిక, ఏవో జయలక్ష్మి సూచిం చారు.

చిప్పగిరి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయ పంటల సాగుతోనే రైతులు అభివృద్ది చెందగలరని శాస్త్రవేత్తలు చందన, సుజాత, మౌనిక, ఏవో జయలక్ష్మి సూచిం చారు. సోమవారం చిప్పగిరి మండలం, ఏరూరు వికసిత్ కృషి సంకల్ప అభియాన్‌లో భాగంగా కర్నూలు ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డా.పి.సు జాతమ్మ వరి, జొన్న సాగులో యాజ మాన్య పద్దతులపై మాట్లాడారు. చిప్పగిరి ఏవో జయలక్ష్మి ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ విషయాలను తెలిపారు. కేవీ శాస్త్రవేత్త డా. వై.మౌనిక, మిరప, ఉల్లి పత్తి యాజమాన్య పద్దతులు తెలియ జేశారు. చందన మాట్లాడుతూ కేవీకే బనవాసిలో రైతులకు అధిక దిగుబడి ఇచ్చే కంది, కొర్ర విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం రైతులకు కంది, శనగ, పత్తి, సాయిల్ శాంపిల్ కలెక్షన్ సాహిత్యాన్ని పంపిణీ చేశారు.