Share News

ఎరువు.. బరువు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:25 AM

మండలంలో దాదాపు 40 వేల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేక వాటి ధరలు పెరిగిపోయాయి. దుకాణదారులు బస్తాపై రూ.50ల నుంచి రూ.వంద వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు.

ఎరువు.. బరువు

బస్తాపై రూ.50 అదనం

కాంప్లెక్స్‌ ఎరువు కొంటేనే ఇస్తామంటున్న డీలర్లు

ఆర్థికభారంతో అవస్థలు పడుతున్న రైతులు

దేవనకొండ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో దాదాపు 40 వేల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేక వాటి ధరలు పెరిగిపోయాయి. దుకాణదారులు బస్తాపై రూ.50ల నుంచి రూ.వంద వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే అదనంగా కాంప్లెక్స్‌ ఎరువు కొంటేనే ఇస్తామని షరతు విధిస్తున్నారు. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు.

కృత్రిమ కొరత..

ప్రైవేటు దుకాణదారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యూరియా,14,35,15, 14,14,0,28 ,20,20,0,13 ఎరువులను కోనుగొలు చేసేందుకు దుకాణాలకు వెళ్తే అందుబా టులో లేవని దుకాణదారులు అంటున్నారు. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ప్రభుత్వ ధర రూ.270లు కాగా డీలర్లు రూ.300ల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే యూరియా కావాలంటే, కాంప్లెక్స్‌ ఎరువును కొంటేనే ఇస్తామని రైతులపై ఒత్తిడి తేస్తున్నారు.

ఒక్కోక్కరికి ఒక్కోలా ధరలు

నాలుగు ఎకరాల్లో పత్తి సాగుచేశా. టర్నింగ్‌ వద్ద ఉన్న ఎరువుల దుకాణంలో 20,20,0,13 బస్తా ధర రూ.1300లు కాగా దుకాణాదారుడు రూ.1,350లు చెప్పాడు. దీంతో వెనక్కు వచ్చా. వ్యసాయాధికారులు చర్యలు తీసుకోవాలి. - పరమేష్‌, రైతు

యూరియా వస్తుంది

మండల రైతులకు 2 వేల బస్తాల యురి యా అందుబాటులోకి వస్తుంది.. రైతులు అందోళన చెందవద్దు. రైతుల అవసరా మేరకు అన్ని రకాల ఎరువులను అందుబా టులోకి తెస్తాం.- ఉషారాణి, ఏవో

Updated Date - Jun 27 , 2025 | 12:26 AM