మహానందిలో హైకోర్టు జడ్జి
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:44 PM
మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుడిని హైకోర్టు జడ్జి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మహానంది, జూలై 27(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుడిని హైకోర్టు జడ్జి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముం దుగా వీరికి ఆలయ ముఖ మండపం వద్ద తహసీల్దార్ రమాదేవి, ఆర్‌ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి ప్రధా న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, కుంకుమా ర్చన, కోదండ రామాలయంలో నామార్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో వేదపండితులు వీరిని ఆశీర్వ దించారు. ఈవో శ్రీనివాసరెడ్డి జస్టిస్ గోపాలకృష్ణారావు దంపతులను శాలువాతో సన్మానించి, స్వామివారి మెమెంటోను అందజేశారు. వీరి వెంట నంద్యాల జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి తంగమణి, ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు, ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ఉన్నారు.