Share News

ఏ,బీ,సీ క్యాంపుల్లోనే హైకోర్టు బెంచ్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:21 AM

నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లోనే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. సోమవారం సాయంత్రం బుధవారపేట సమీపంలోని మెడికల్‌ కళాశాల వద్ద రూ. 34.68 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం, డ్రైయిన్స్‌ను ప్రారంభించి

ఏ,బీ,సీ క్యాంపుల్లోనే హైకోర్టు బెంచ్‌
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి టీజీ భరత్‌

రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌

మెడికల్‌ కళాశాల వద్ద విస్తరించిన రహదారి ప్రారంభం

కర్నూలు అర్బన్‌ , నవంబరు 24(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లోనే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. సోమవారం సాయంత్రం బుధవారపేట సమీపంలోని మెడికల్‌ కళాశాల వద్ద రూ. 34.68 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం, డ్రైయిన్స్‌ను ప్రారంభించి, కాంపౌండ్‌ వాల్‌ పనులకు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్‌ సోమిశె ట్టివెంకటేశ్వర్లుతో కలిసి భూమి పూజ చేశారు. రెండు దశాబ్దాలుగా రోడ్డు ఇరుకుగా ఉండి, ప్రమాదాలు జరిగి పలువురు మరణించారన్నారు. మసీదు కమిటీ వారితో చర్చించి, అవసరం మేరకు నిర్మాణాలను తొలగించామన్నారు. నగరంలోని ఏబీసీ క్యాంపు లలోనే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని, ఈవిషయం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. కిడ్స్‌ వరల్డ్‌ నుంచి బుధవారపేట వంతెన వరకు రహదారి విస్తరణ పనులు అందరి ఆమోదంతో చేస్తామన్నారు. కళ్యాణ్‌ జ్యూవెలర్స్‌ నుంచి బుధవారపేటకు హంద్రీ నదిపై వంతెన నిర్మాణానికి ఆలోచనలు చేస్తున్నామన్నారు. కర్నూలులో నిర్వహించిన జాబ్‌ మేళాలో 900 మందికి ఉద్యోగాలు వచ్చాయని, డిసెంబర్‌ 8న కూడా మరో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు.

ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్‌, అధికారులు చాకచక్యంగా సమస్యను పరిష్కరించారన్నారు. కమిషనర్‌ విశ్వనాథ్‌, మైనార్టీ వెల్పెర్‌ ఆపీసర్‌ సబిహ పర్వీన్‌, స్వామి రెడి ్డ, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు అబ్బాస్‌, మసీదు కమిటీ సభ్యులు, ముత్తవల్లి పాల్గొన్నారు.

కర్నూలు అభివృద్ధికి కృషి

కర్నూలు నగరరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్‌ అన్నారు. సోమవారం గడియారం ఆస్పత్రి సమీపంలోని ప్రీమెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ ఉర్దూ హస్టల్స్‌కు మహమ్మదీయ వక్ప్‌ కాంప్లెక్స్‌ కేర్‌ టేకర్‌ కమిటీ ఆధ్వర్యంలో రిఫ్రిజిరేటర్లు, కుర్చీలు, ప్లేట్లు అందజేశారు. పేద ముస్లిం యువతులకు వివాహాలకు సాయం చేస్తున్నామని, వక్ఫ్‌ కాంఫ్లెక్స్‌ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఫంక్షన్‌ హాల్‌ను పూర్తి చేసేం దుకు కృషి చేస్తామన్నారు. మైనార్టీ వెల్పెర్‌ అధికారి సయ్యద్‌ సబిహ పర్వీన్‌, కమిటి ప్రసిడెంట్‌ ఇబ్రహిం, రాష్ట్ర హజ్‌ కమిటి సభ్యులలు మన్సూర్‌ ఆలీ ఖాన్‌, జహంగీర్‌ బాషా, హమీద్‌, కేర్‌ టేకర్‌ కమిటి వైస్‌ ప్రసిడెంట్‌ మహబూబ్‌, రబ్బాని, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 01:21 AM