మిరప పంటకు గడ్డి మందు పిచికారీ
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:29 AM
మిరప పంట బాగా దిగుబడి వచ్చిందనన్న కక్షతో తమ్ముడి మిరప పంటకు గడ్డి మందు కొట్టి అన్న, అన్న కొడుకులు నాశనం చేశాడు.
రూ.10 లక్షల పంట నష్టం ఫ ఇద్దరిపై కేసు నమోదు
మంత్రాలయం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మిరప పంట బాగా దిగుబడి వచ్చిందనన్న కక్షతో తమ్ముడి మిరప పంటకు గడ్డి మందు కొట్టి అన్న, అన్న కొడుకులు నాశనం చేశాడు. మంత్రాలయం మండలంలోని సూగూరు గ్రామానికి చెందిన పింజరి మాబు సాబ్, దస్తగిరమ్మకు రెండెకరాల పొలం ఉంది. ఒక ఎకరాలో పత్తి వేయగా.. మరో ఎకర పచ్చి మిరప 2043 గాడిగరకం మిర్చి పంటను సాగు చేశాడు. అయితే.. పంట గ్రామంలోనే అధిక దిగుబడి రావడం చూసి ఓర్వలేక అన్న అబ్దుల్, కుమారుడు రెహిమాన్ రాత్రికిరాత్రి గడ్డి మందు పిచికారీ చేశారు. దంతో పంట ఎండిపోయి మిరపకాయలు రాలిపోయి మచ్చలు ఏర్పడ్డాయి. ఈనెల 12న పిచికారీ చేయగా.. 13వ తేదీ మధ్యాహ్నం నాటికి మిరప పంట మచ్చలు సోకి ఎండిపోయింది. ఇది గమనించిన రైతు పిచికారీ మందు యజమానికి సమాచారం ఇచ్చారు. కంపెనీ అధికారులు పొలాన్ని చూసి అదే మందును కురువ మహదేవ, జూట వీరనాగుడు, బూదూరు గ్రామంలో పిచికారీ చేశారు. తన పక్క పొలంలోనే ఉన్న అన్న కొడుకు ఈ పని చేశారని గుర్తించి గురువారం మంత్రాలయం పోలీస్‌స్టేషన్‌లో బాధిత రైతు దంపతులు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్న పింజరి అబ్దుల్, రెహిమాన్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను ఓర్వలేక సొంత అనే రూ.10 లక్షల పంటను నాశనం చేయడం.. తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు. దాదాపు రూ.5 లక్షలు అపులు చేసి ఈ ఏడాదైనా అప్పులు తీరుతాయనుకుంటే అన్నే తమ్మునికి ఇంత నష్టం కలిగించడం చర్చనీయాంశంగ మారింది.