మహిళలను ఆదుకునేలా చర్యలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:05 AM
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళలను ఆదుకునేలా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళలను ఆదుకునేలా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళల కోసం అమలు చేస్తున్న వన్‌స్టాఫ్, మహిళా హెల్ప్‌లైన్, నారీ అదాలత్, శక్తి సదన్ తదితర కార్యక్రమాల అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళలను ఆదుకునేలా జిల్లా హెడ్ క్వార్టర్‌లోనే కాకుండా డివిజనల్, మండల హెడ్ క్వార్టర్‌లో ఈ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం అంగన్‌వాడీ వర్కర్ల సేవలతో పాటు మహిళా పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ వన్‌స్టాఫ్ సెంటర్ ద్వారా సర్వీసులకు సంబంధించి రిజిస్టర్‌లు కచ్చితంగా మెయింటైన్ చేయాలని సంబందిత సిబ్బందిని ఆదేశించారు. పరిహారం కేసులను పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషినల్ ఎస్పీ హుశేన్‌పీరా, ఐసీడీఎస్ పీడీ నిర్మల, డీఎంహెచ్‌వో డా.శాంతికళ, సెట్కూరు సీఈవో వేణుగోపాల్, విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.