Share News

జిల్లాలో భారీ వర్షం

ABN , Publish Date - May 18 , 2025 | 11:36 PM

నంద్యాల జిల్లాలో శనివారం రాత్రి పలు మండలాల్లో భారీగా వర్షం కురిసింది. ఉయ్యాలవాడ మండలంలో 32.2 ఎంఎం అత్యధిక వర్షపాతం నమోదు కాగా శ్రీశైలంలో 1.4ఎంఎం అత్యల్ప వర్షపాతం నమోదైంది.

 జిల్లాలో భారీ వర్షం
బండిఆత్మకూరులో కురుస్తున్న వాన

ఉయ్యాలవాడలో 32.2 ఎంఎం వర్షపాతం

శ్రీశైలంలో అత్యల్పంగా 1.4 ఎంఎం

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో శనివారం రాత్రి పలు మండలాల్లో భారీగా వర్షం కురిసింది. ఉయ్యాలవాడ మండలంలో 32.2 ఎంఎం అత్యధిక వర్షపాతం నమోదు కాగా శ్రీశైలంలో 1.4ఎంఎం అత్యల్ప వర్షపాతం నమోదైంది. అవుకు మండలం కొండమాయపల్లెలో 29.5, సంజామల మండలం ముదిగేడులో 24.5, కోవెలకుంట్లలో 23.75, పాణ్యం మండలం కౌలూరులో 22.0, నంద్యాల పట్టణంలో 19.5, రుద్రవరం మండలం యల్లావత్తులలో 18.0, గడివేములలో 17.0, ఆళ్లగడ్డలో 12.5, ప్యాపిలి మండలం మెట్టుపల్లెలో 9.0, బనగానపల్లె మండలం పలుకూరులో 8.75, పాములపాడు మండలం తుమ్మలూరులో 8.0, డోన్‌ మండలం జలదుర్తిలో 5.5, డోన్‌లో 4.25, అవుకు మండలం రామాపురంలో 4.0, అవుకు పట్టణంలో 2.5, శ్రీశైలంలో 1.4ఎంఎం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది.

నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

నంద్యాల జిల్లాలో సోమవారం గంటకు 50 నుంచి 60కిలోమీటర్ల వేగంతో గాలులు, గంటకు 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావ రణ సంస్థ వెల్లడించింది. అలాగే అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశ ముందని, ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Updated Date - May 18 , 2025 | 11:36 PM