పలు మండలాల్లో భారీ వర్షం
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:07 AM
నంద్యాల జిల్లాలో శనివారం రాత్రి పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది.
కొలిమిగుండ్లలో 98.0 మి.మీ.ల వర్షపాతం నమోదు
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో శనివారం రాత్రి పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొలి మిగుండ్లలో 98.0మి.మీ వర్షపాతం నమోదైంది. ఉయ్యాలవాడలో 38.8, చాగలమర్రి 38.8, రుద్రవరం 32.2, ఆళ్లగడ్డ 28.4, సంజామల 26.2, దొర్ని పాడు 20.4, కోవెలకుంట్ల 15.4, అవుకు 12.2, నంద్యాల 11.4, బండి ఆత్మకూరు 9.2, వెలుగోడు 8.2మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.