Share News

కోడుమూరు మండలంలో భారీ వర్షం

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:20 AM

మండలంలో రెండురోజుల నుంచి వర్షం కురుస్తోంది. దీంతో రైతన్నకు కంటిమీద కునుకు లేదు. ఉల్లి కోతలు ఆగిపోయి రైతులు దారుణంగా దెబ్బతిన్నారు.

కోడుమూరు మండలంలో భారీ వర్షం
పొలంలో ఆగిపోయిన సజ్జ నూర్పిళ్లు

కోడుమూరు రూరల్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో రెండురోజుల నుంచి వర్షం కురుస్తోంది. దీంతో రైతన్నకు కంటిమీద కునుకు లేదు. ఉల్లి కోతలు ఆగిపోయి రైతులు దారుణంగా దెబ్బతిన్నారు. చాలామంది రైతులు పొలాల్లోనే ఉల్లిపంటను గొర్రెలకు వదిలేశారు. అలాగే పత్తి పొలాల్లో దూది తడిసిపోయింది. మండలంలోని ఎర్రదొడ్డిలో మట్టిమిద్దె కూలింది. వివరాల మేరకు.. ఎస్సీ కాలనీలో లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో వంట చేస్తుండగా శబ్ధం రావడంతో పరుగును బయటకు వెళ్లింది. వెంటనే మిద్దెకూడలంతో తల, కాళ్లకు గాయాలయ్యాయి.

Updated Date - Sep 28 , 2025 | 12:20 AM