Share News

కోడుమూరులో భారీ వర్షం

ABN , Publish Date - May 18 , 2025 | 12:51 AM

మండలంలో శని వారం తెల్లవారుజామున సుమారు గంటకుపైగా భారీ వర్షం కురి సింది.

కోడుమూరులో భారీ వర్షం
క్రిష్ణాపురంలో విరిగి పడిన చెట్టు కొమ్మ

కోడుమూరు రూరల్‌, మే 17(ఆంధ్రజ్యోతి): మండలంలో శని వారం తెల్లవారుజామున సుమారు గంటకుపైగా భారీ వర్షం కురి సింది. బలమైన గాలులు, వర్షం ప్రభావంతో పట్టణంలో పలుచోట్ల విద్యుత స్తంభాలు, చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. స్థానిక సంత మార్కెట్‌ సమీపంలో బజారి, సాలమ్మ దంపతులకు చెందిన పూరి గుడిసె గోడకూలి, రేకులు లేచి పడ్డాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారులను తీసుకుని బయ టకు రావడంతో ప్రమాదం తప్పింది. దీంతో పూరిగుడిసె దెబ్బతిని, తిండి గింజలు పాడైపో యాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఐ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే క్రిష్ణాపురంలో విద్యు త స్తంభాలు విరిగిపడ్డాయి. ఇళ్లమధ్య చెట్లకొమ్మలు విరిగి మిద్దెలపై పడ్డాయి. మండలంలో 33.6 మి.మీ వర్షపాతం నమోదైంది.

సర్పంచ దంపతుల ఉదారత: కోడుమూరు పట్టణంలో పూరిగుడిసె కూలి, తిండిగింజలు తడిసిపోవడంతో వీధినపడ్డ బజారి కుటుంబాన్ని సర్పంచ భాగ్యరత్నమ్మ, ఆంధ్రయ్య దంపతులు పరామ ర్శించారు. వారికి సర్పంచ దంపతులు రూ. 10,500 ఆర్థికసాయం చేశారు. ఈవో అజయ్‌భాస్కర్‌, ఉపసర్పంచ మాదులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:51 AM