గూడూరులో భారీ వర్షం
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:37 AM
మండలంలో సోమవారం తెల్ల వారుజామున భారీ వర్షం కురిసింది.
పొంగి పొర్లిన వక్కెర వాగు
గూడూరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం తెల్ల వారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో వంకలు, వాగులు పొంగి పొర్లాయి. గత రెండు, మూడు రోజులుగా మండలంలో భారీ వర్షాలు కురవడంతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజలు క్రితం పెంచికలపాడు దగ్గర ఉన్న బ్రిడ్జిపై వరద వచ్చి చేరింది. సోమవారం ఉదయం బ్రిడ్జిపై వరద రావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెంచికలపాడు బ్రిడ్జి ఎత్తును పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఓర్వకల్లు: ఓర్వకల్లు మండలంలో సోమవారం తెల్లవారుజామున వర్షం దంచి కొట్టింది. దీంతో వాగులు, వంకలు, చెరు వులు, చెక్‌డ్యాంలు నీటితో పొంగి పొర్లుతున్నాయి. ఓర్వకల్లు సమీపంలోని కుందూ వాగు నీటితో కళకళలా డుతోంది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.