Share News

చాగలమర్రిలో భారీ వర్షం

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:25 AM

చాగలమర్రి మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములతో కూడిన భారీ వర్షం కురి సింది.

చాగలమర్రిలో భారీ వర్షం
ముత్యాలపాడులో నీట మునిగిన మినుము పంట

పొంగి ప్రవహించిన అడ్డవాగు

నీట మునిగిన పొలాలు

చాగలమర్రి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): చాగలమర్రి మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములతో కూడిన భారీ వర్షం కురి సింది. 12.2 మీ.మీ వర్షపాతం నమోదైంది. గోపాయపల్లె రహ దారిలోని అడ్డవాగు పొంగి ప్రవహించింది. సమీపంలోని పంట పొలాల్లో సాగు చేసిన కంది, మినుము, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. రెండు రోజులు తిరగక ముందే మళ్లీ వర్షం కురవడంతో రహదారులపై ఆరబె ట్టుకున్న మొక్కజొన్న ధాన్యం తడిచిపోయింది. చింతలచెరువు, చిన్న వంగలి గ్రామాల సమీపంలో ఉల్లి పంట కోత కోసి పంట పొలాల్లో ఆరబెట్టుకున్న ఉల్లిగడ్డలు తడవడంతో రైతులు ఆవేదన చెందారు. ఽనేలంపాడు, గొట్లూరు గ్రామాల సమీపంలో వరద నీరు తగ్గక ముందే మళ్లీ వర్షం కురవడంతో పంట పొలాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. 1,100 ఎకరాల్లో మొక్కజొన్న, 200 ఎకరాల్లో మినుము, 100 ఎకరాల్లో జూట్‌, 50 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నాయి.

రుద్రవరం: మండలంలో శుక్రవారం వర్షం కురిసింది. మొక్కజొన్నలు తడిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బి.నాగిరెడ్డిపల్లె మెట్ట, చిన్నకంబలూరు, నరసాపురం, ముత్తలూరు, నల్లవాగుపల్లె, హరి నగరం సమీపంలో రహదారులపై ఆరబోసిన మొక్కజొన్నలు వర్షానికి తడిచాయని రైతులు వాపోయారు.

Updated Date - Oct 11 , 2025 | 12:25 AM