Share News

ఆళ్లగడ్డలో భారీ వర్షం

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:11 AM

ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో సోమవారం తెల్లవారు జామున నుంచి ఉదయం వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది.

ఆళ్లగడ్డలో భారీ వర్షం
ఓబులంపల్లెలో ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వక్కిలేరు

పొంగి ప్రవహిస్తున్న వక్కిలేరు

రాకపోకలకు అంతరాయం

ఆళ్ళగడ్డ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో సోమవారం తెల్లవారు జామున నుంచి ఉదయం వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. మండలంలో సోమవారం 33.6 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని పడకండ్ల గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై నుంచి వర్షం నీరు ప్రవహిస్తుంది. అలాగే మండలంలోని ఓబులంపల్లె గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి పై నుంచి వక్కిలేరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో యాదవాడ, ఆలమూరు తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. డీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అహోబిలంలోని రోడ్డు పక్కన రైతులు ఆరబెట్టుకొన్న మొక్కజొన్న పంట వర్షం నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఉప్పొంగిన అట్టడివాగు

రుద్రవరం: మండలంలోని ఆలమూరు గ్రామ సమీపంలో ఉన్న అట్టడి వాగు సోమవారం పొంగి ప్రవహించింది. ఆల మూరు నుంచి చాగలమర్రి మిట్టపల్లె వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగులో గతంలో ఓ యువకుడు గల్లంతైన విషయం విదితమే. ఒక్కసారిగా అట్టడి వాగు పొంగి ప్రవహించడంతో ప్రజలు భయాందోళన చెందారు. స్థానికులు ట్రాక్టర్ల సాయంతో జనాలను వాగు దాటించారు.

Updated Date - Oct 07 , 2025 | 12:11 AM