జోరువాన
ABN , Publish Date - May 27 , 2025 | 12:25 AM
పట్టణంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురి సింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదోనిలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం, మిగతా మండలాల్లోనూ..
ఆదోని అగ్రికల్చర్, మే 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురి సింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి.ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పనులు మమ్మురం చేశారు. పొలాలు దుక్కి, దున్ని సాగుకు సమాయత్తమ వుతున్నారు.
బురదమయంగా దారులు
ఆలూరు రూరల్: మండలలో వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల రహదారుల బుదరమయంగా మారాయి. కురకుంద, మొలగవల్లి, పెద్దహోతూరు, తుంబళబీడు, మరకట్టు, ముసనహళ్ళి తదితర గ్రామల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ లేకపోవడంతో నీరు ఇళ్ల ముందే నిలిచి దుర్వాసన వస్తోంది.
దిగువ కాలువకు నీరు
హాలహర్వి: మండలంలో వర్షాలు కురుస్తుండటంతో దిగువకాలువకు నీరు చేరుతోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు జోరుగా వాన కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వేదవతి నది నిండుగా ప్రవహించడంతో రైతులు పత్తి సాగుకు సిద్ధమయ్యారు
మద్దికెర: గ్రామంలో రెండు రోజులుగా ంకురిన వర్షాలకు రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బస్టాండు వద్ద బసవన్న గుడి ప్రధాన రహదారిపై గుంతలు ఉండటంతో నీరు నిలిచింది. పంచాయతీ అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. గుంతలను మొరుసుతో నింపుతామని పంచాయతీ కార్యదర్శి శివకుమార్ వివరణ ఇచ్చారు.