Share News

యెగాతో ఆరోగ్యం

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:45 AM

ప్రతి రోజు యోగా చేస్తే ఆరోగ్యం గా ఉంటారని కర్నూలు విద్యుతశాఖ ఎస్‌ఈ ఎం.ఉమాపతి అన్నారు.

యెగాతో ఆరోగ్యం
యోగాసనాలు వేస్తున్న విద్యుత శాఖ ఎస్‌ఈ, ఉద్యోగులు

విద్యుత శాఖ ఎస్‌ఈ ఉమాపతి

కల్లూరు, జూన 20(ఆంధ్రజ్యోతి): ప్రతి రోజు యోగా చేస్తే ఆరోగ్యం గా ఉంటారని కర్నూలు విద్యుతశాఖ ఎస్‌ఈ ఎం.ఉమాపతి అన్నారు. శుక్రవారం నగరంలోని విద్యుతభవన ఆవరణలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నద్ధత కార్యక్రమంలో భాగంగా యోగా గురువు పెరుమాళ్ల సత్తయ్య ఆధ్వర్యంలో ఉద్యోగులకు అభ్యాసనం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మే 21 నుంచి జూన 21 వరకు అంత ర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుకుంటున్నామని ఎస్‌ఈ తెలి పారు. టెక్నికల్‌ ఏఈ ఓబులేసు, కనస్ట్రక్షన ఈఈ మహేశ్వరరెడ్డి, కర్నూలు టౌన డివిజన ఈఈ టి.శేషాద్రి, లత, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:45 AM