ప్రతి రోజు సైక్లింగ్‌తో ఆరోగ్యం
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:11 AM
ప్రతి రోజు సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యం, శారీరక దృఢత్వం వస్తుందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు.
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల టౌన్, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): ప్రతి రోజు సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యం, శారీరక దృఢత్వం వస్తుందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యా లయంలో సండే ఈజ్ సైక్లింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు ‘ఫిట్ ఇండియా’ అనే కార్య క్రమంలో భాగంగా సైక్లింగ్ జిల్లావ్యాప్తంగా చేయాలని సూచించామన్నారు. మానసిక, ఉద్యోగ ఒత్తిడిని తగ్గించాలంటే పోలీసులు చాలా ఫిట్‌గా ఉండాలన్నారు. ప్రస్తుతం జీవన శైలిలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నా యని, వాటిని అధిగమించాలంటే ఇలాంటి వ్యాయామం తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు.