నులి పురుగుల నిర్మూలనతో ఆరోగ్యం
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:40 AM
నులిపురుగుల నిర్మూలనతో ఆరోగ్యకరమైన జీవనశైలి వస్తుందని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. మంగళవారం పట్టణం లోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): నులిపురుగుల నిర్మూలనతో ఆరోగ్యకరమైన జీవనశైలి వస్తుందని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. మంగళవారం పట్టణం లోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లల్లో శుభ్రత, పరిశుభ్రత అలవా టు చేయడం, సక్రమమైన ఆహారపు అలవాట్లతో నులి పురుగులను నివారించ వచ్చ న్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు. డీడీ రంగనాథరావు, జిల్లా మలేరియా అధికారి నూకరాజు, డిప్యూటీ డీఎంహెచ్‌వో రఘురాం రెడ్డి, మెడికల్ ఆఫీసర్ షాహినాజ్‌బేగం, డాక్టర్ సందీప్, డీపీఎంవో సీతారాముడు, జ్ఞానేశ్వర్, మధు పాల్గొన్నారు.
మాత్రలు పంపిణీ
ఆదోని రూరల్: మండలంలోని పెద్దహరివాణం, పెద్దతుంబళం పీహెచ్‌సీ పరిధిలో పిల్లలకు మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. వైద్యులు హిమ్రాన్, ఆశాలత మాట్లాడుతూ, తమ సిబ్బంది పాఠశాలలకు వెళ్ళి సిబ్బంది సమక్షంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారన్నారు. అల్బెండజోల్ మాత్ర వేసుకుంటే శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతారన్నారు.