పరిశుభ్రతతోనే ఆరోగ్యం
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:13 PM
: పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండగలమని కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు.
కలెక్టర్ డాక్టర్ సిరి
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండగలమని కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. గురువారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛతా హీసేవ’ కార్యక్రమంలో ఆమె పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. చెత్తను కాలువల్లోను, రోడ్డ పక్కన వేయకుండ పారిశుధ్య కార్మికులు ఇంటివద్దకు వచ్చినప్పుడు చెత్తను అందజేయాలన్నారు. ఈ సం దర్భంగా పారిశుధ్య కార్మికులతో మాట్లాడి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ పి.విశ్వనాథ్, ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వరరెడ్డి, మెప్మా సీఎంఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.