హెల్త్ సెక్రటరీలకు గ్రేడ్-3 పదోన్నతి ఇవ్వాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:56 AM
గ్రామ, వార్డు సచివాల యాల్లో పని చేస్తున్న హెల్త్ సెక్రటరీలకు గ్రేడ్-3 పదోన్నతి కల్పించాలని కోరుతూ మంగళవారం డీఎం హెచవో కార్యాలయం ఎదుట హెల్త్ సెక్రట రీలు ధర్నా చేశారు.

డీఎంహెచవో ఆఫీసు ఎదుట ధర్నా
కర్నూలు హాస్పిటల్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాల యాల్లో పని చేస్తున్న హెల్త్ సెక్రటరీలకు గ్రేడ్-3 పదోన్నతి కల్పించాలని కోరుతూ మంగళవారం డీఎం హెచవో కార్యాలయం ఎదుట హెల్త్ సెక్రట రీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా హెల్త్ సెక్రటరీ యూనియన రాష్ట్ర కార్యదర్శి సంధ్యా రాణి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, జిల్లా అధ్యక్షుడు రాధా కృష్ణ మాట్లాడుతూ కడప జిల్లాలో పదోన్న తులు ఇచ్చినప్పటికీ మిగిలిన జిల్లాలో ఇవ్వక పోవడం అన్యాయమన్నారు. పదోన్నతులు ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్ది ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పదో న్నతుల ప్రక్రియ చేపట్టాలని కోరారు. అనం తరం డీఎంహెచవో పి.శాంతికళకు వినతి పత్రం అందజేశారు. త్వరలోనే హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ అసోసియేషన జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జే.నాగేశ్వర రావు, అసోసియేషన నాయకురాలు వెంకటే శ్వరమ్మ, గౌరి పాల్గొన్నారు.