Share News

ఆరోగ్య భద్రతను కాపాడాలి

ABN , Publish Date - May 01 , 2025 | 12:36 AM

: సమాజంలో ప్రజల ఆరోగ్యభద్రతను కాపాడాలని ఈగల్‌ సెల్‌ ఎస్‌ఐ సృజన్‌ కుమార్‌, పత్తికొండ సీఐ జయన్న, మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఉపాధ్యక్షులు నాగరాజు, నీలకంఠ కోరారు

ఆరోగ్య భద్రతను కాపాడాలి
పోస్టర్లు విడుదల చేస్తున్న అధికారులు

పత్తికొండ టౌన్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్ర జ్యోతి): సమాజంలో ప్రజల ఆరోగ్యభద్రతను కాపాడాలని ఈగల్‌ సెల్‌ ఎస్‌ఐ సృజన్‌ కుమార్‌, పత్తికొండ సీఐ జయన్న, మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఉపాధ్యక్షులు నాగరాజు, నీలకంఠ కోరారు. బుధవారం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో పత్తికొండ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మెడికల్‌ షాపుల యజమానులకు డ్రగ్స్‌, విత్‌ అవుట్‌ ప్రిస్కిప్షన్‌ పై అవగాహన కల్పించారు. ఎన్‌ఆర్‌ఎస్‌ ఉల్లంఘనతో రోగుల ఆనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. మెడికల్‌ షాపుల యజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, డాక్టర్‌ పేరు, ఎంసీఐ నెంబర్‌ ప్రిస్కిప్షన్‌పై తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - May 01 , 2025 | 12:36 AM