సంపూర్ణ పోషణతోనే ఆరోగ్య రక్షణ
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:04 AM
సంపూర్ణ పోషణతోనే ఆరోగ్యానికి రక్షణ అని ఇన్‌చార్జి కలెక్టర్ డా.బి.నవ్య అన్నారు.
ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ బి.నవ్య
‘రాష్ట్రీయ పోషణ్’ మాసోత్సవాలు ప్రారంభం
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సంపూర్ణ పోషణతోనే ఆరోగ్యానికి రక్షణ అని ఇన్‌చార్జి కలెక్టర్ డా.బి.నవ్య అన్నారు. కర్నూలులోని ఏ.క్యాంపు అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో మహిళాభివృద్ధ్ది శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నవ్య మాట్లాడుతూ కుటుంబ సభ్యులందరూ ఒకేసారి భోజనం చేయాలన్నారు. చాలా మంది మహిళలు కుటుంబ సభ్యులు భోజనం చేసిన తర్వాతనే భోజనం చేస్తారని, ఇది సరైంది కాదన్నారు. మహిళలు ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే కుటుంబ సభ్యులందరూ ఒకేసారి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ మాట్లాడుతూ జిల్లాలోని 1,886 అంగన్‌వాడీ కేంద్రాలు, 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 75సెక్టార్లలో ఈ కార్యక్ర మాలు అక్టోబరు 16వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. గర్భిణులకు సీమంతం, చిన్న పిల్లలకు అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ సీడీపీవో జి.అనురాధమ్మ, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ రాజేశ్వరి, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కే.బాలు, సూపర్‌వైజర్, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.