డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పన
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:57 PM
కర్నూలు ఐఐఐటీ డీఎం విద్యాసంస్థ ఆధ్వర్యంలో డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఐఐఐటీ డీఎం ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు.
పరిశీలించిన కలెక్టర్ రంజిత్‌బాషా
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కర్నూలు ఐఐఐటీ డీఎం విద్యాసంస్థ ఆధ్వర్యంలో డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఐఐఐటీ డీఎం ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసు కుని తక్షణ వైద్యసదుపాయం అందించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడు తుందన్నారు. ఘటనా స్థలంలోనూ, ఆసుపత్రికి వెళ్తున్న సమయంలోనూ రోగుల పరిస్థితిని వైద్యులు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి వైద్యసేవలు అందించేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ వ్యవస్థ వైద్యులు, ఆసుపత్రుల మధ్య రియల్ టైం కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఏర్పరుస్తుందన్నారు. అత్యవసర హెచ్చరికలు, గ్రీన్ చానల్ సమయంలో అంబులెన్సుకు రూట్ క్లియర్ చేసేందుకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కె.కృష్ణానాయక్, రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
డాక్యుమెంట్లను అప్‌లోడు చేయాలి
అన్నిశాఖల అధికారులు తమ కార్యాలయాలకు చెందిన డాక్యుమెం ట్లను అప్‌లోడు చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం ఈటీపీఎస్ ఆన్‌లైన్ పోర్టల్‌లో డాక్యుమెంటు అప్‌లోడు చేసే అంశంపై కలెక్టర్ జిల్లా అధికారులతో, తహసీల్దార్లతో, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు తమ కార్యాలయాలకు సంబంఽ దించిన చట్టాలు, నియమ నిబంధనలు, మెమోలు, జీవోలు సర్కులర్‌లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు స్కానింగ్‌చేసి ఈటీపీ ఎస్ ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడు చేయాలన్నారు. రియల్ టైం గవర్నెన్స్‌లో ఈ ప్రక్రియ నిర్వహి స్తారని, అధికారులు మూడు రోజుల్లోపు డాక్యుమెంట్లు అప్‌లోడు పూర్తికా వాలన్నారు. జేసీ డా.బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్వో వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్, జడ్పీ సీఈవో నాసరరెడ్డి పాల్గొన్నారు.