Share News

వాయు కాలుష్యంతో ఆరోగ్యంపై ప్రభావం

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:08 AM

వాయు కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు. శనివారం స్వర్ణాంద్ర-స్వచ్చాంద్రలో భాగంగా 19వ వార్డు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ పార్క్‌లో ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.

వాయు కాలుష్యంతో ఆరోగ్యంపై ప్రభావం
జీఎస్టీపై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): వాయు కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు. శనివారం స్వర్ణాంద్ర-స్వచ్చాంద్రలో భాగంగా 19వ వార్డు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ పార్క్‌లో ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాని పిలుపునిచ్చారు పరిసరాలను కాపాడుకోవడం భాద్యతగా బావించాలని సూచించారు. పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి పాల్గొన్నారు.

వాహన కొనుగోలుదారులకు ఊరట

జీఎస్టీ తగ్గింపుతో వాహనాల కొనుగోలు దారులకు ఊరట లభించిందని ఎమ్మెల్యే, జడ్పీ సీఈవో నారసనరెడ్డి అన్నారు. శనివారం సి.క్యాంప్‌ సమీపంలోని శౌర్యా హోండా షోరూంలో ఎమ్మెల్యే వినియోగ ారులకు అవగాహన కల్పించారు.

గౌరు దంపతులకు ముస్లింల సన్మానం

బస్తిపాడు గ్రామ ముస్లింలు పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ గౌరు వెంకటరెడ్డి దంపతులను శనివారం ఉలిందకొండ సింగిల్‌ విండో డైరెక్టర్‌ బోయ నాగరాజు, సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వారిని కలిశారు. బస్తిపాడులో శాధిఖాన నిర్మాణానికి, శ్మశాన వాటికకు కంపౌండ్‌వాల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలనివినతిపత్రం అందజేశారు. తడకనపల్లె సర్పంచ్‌ సహరాభి, బందే మహబుబ్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:08 AM