Share News

హెల్త్‌ అసిస్టెంట్ల నిరసన

ABN , Publish Date - May 03 , 2025 | 11:45 PM

కర్నూలు జిల్లా యూనిట్‌గానే పని సర్దుబాటు కౌన్సెలింగ్‌ నిర్వహించాలంటూ జిల్లాకు చెందిన 40 మంది హెల్త్‌ అసిస్టెంటు (మేల్‌) డీఎంహెచవో కార్యాల యం ఎదుట శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

హెల్త్‌ అసిస్టెంట్ల నిరసన
డీఎంహెచవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

కర్నూలు హస్పిటల్‌, మే 3(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా యూనిట్‌గానే పని సర్దుబాటు కౌన్సెలింగ్‌ నిర్వహించాలంటూ జిల్లాకు చెందిన 40 మంది హెల్త్‌ అసిస్టెంటు (మేల్‌) డీఎంహెచవో కార్యాల యం ఎదుట శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఉలిందకొండ హెల్త్‌ అసిస్టెంట్‌ నాగన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల యూనిట్లుగా చేసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. 15 రోజుల క్రితం నంద్యాల జిల్లాలో కౌన్సెలింగ్‌ జరిగిందని, వారికి అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చారని, విధుల్లో కూడాచేరారని తెలిపారు. కౌన్సెలింగ్‌ ఉందని అధికారులు మెయిల్‌ ద్వారా పంపితే జిల్లా నలుమూలల నుంచి డీఎంహెచవో కార్యా లయానికి వచ్చామన్నారు. తీరా డీఎంహెచవో డా.పి.శాంతికళ కౌన్సెలింగ్‌ అనేది ఉమ్మడి జిల్లాలో జరుగుతుందని, తేదీ ప్రకటిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా యూనిట్‌గానే కౌన్సిలింగ్‌ జరపాలని కొన్ని పీహెచసీల్లో మలేరియా, డెంగీ కేసులు లేవంటూ పోస్టింగ్‌లు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. ఒక వేళ డెంగీ కేసులు ఆ పీహెచసీల్లో వస్తే అక్కడ ఎవరు సేవలు అందించాలని అడిగారు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో ఎక్కువ పోస్టింగ్‌లు చూపించారని, మారుమూల గ్రామాల ప్రాంతాలైన పత్తికొండ, అలూరు. చిప్పగిరి, తుగ్గలి, మద్దికెరల్లో పోస్టులు ఎందుకు చూపించలేదని మండి పడ్డారు. అనంతరం డీఎంహెచవోకు హెల్త్‌ అసిస్టెంట్లు వినతిపత్రం సమర్పించారు. ‘

Updated Date - May 03 , 2025 | 11:45 PM