Share News

రిటైర్డ్‌ ఉద్యోగి ప్రాణాలు కాపాడిన పోలీస్‌

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:28 AM

టిఫిన్‌ సెంటర్‌లో ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ఆకస్మాత్తుగా కుప్పకూలి పడిపోగా అదే సమయంలో అక్కడికి వచ్చిన నందవరం హెడ్‌ కానిస్టేబుల్‌ కొందడరామిరెడ్డి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన గురువారం ఎమ్మిగనూరు లో చోటుచేసుకుంది.

రిటైర్డ్‌ ఉద్యోగి ప్రాణాలు కాపాడిన పోలీస్‌
సీపీఆర్‌ చేస్తున్న కోదండరామిరెడ్డి

అత్యవసర పరిస్థితిలో సీపీఆర్‌ చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌

ఎమ్మిగనూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): టిఫిన్‌ సెంటర్‌లో ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ఆకస్మాత్తుగా కుప్పకూలి పడిపోగా అదే సమయంలో అక్కడికి వచ్చిన నందవరం హెడ్‌ కానిస్టేబుల్‌ కొందడరామిరెడ్డి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన గురువారం ఎమ్మిగనూరు లో చోటుచేసుకుంది. పట్టణంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్ట్‌ ఉద్యోగి రాజశేఖర్‌ అల్పాహారం చేసేందుకు పెద్దబావి ప్రాంతంలో ఉన్న అమరావతి టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి సృహ తప్పి కుప్పకూలాడు. మూర్చవచ్చిందని స్థానికులు చేతిలో తాళాలు పట్టించారు. ఇదే సమయంలో టిఫిన్‌ సెంటర్‌కు వచ్చిన కోదండరామిరెడ్డి అందరిని పక్కకు జరిపి బాధితుడి ఛాతీపై 10 నిమిషాలు సీపీఆర్‌ చేశాడు. దీంతో రాజశేఖర్‌ లేచి కూర్చున్నాడు. తేరుకు న్నాక మరో సారి కళ్లుతిరిగి కిందకు పడి పోయాడు. దీంతో గుండెపోటు అని గుర్తించిన ఏఎస్‌ఐ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌చేసి మరోసారి సీపీఆర్‌ చేశాడు. బాధితుడు స్పృహలోకి రావటంతో అంబు లెన్స్‌లో చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమా చారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని వైద్యుల సూచనమే రకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రస్తుతం రాజశేఖర్‌ ఆరో గ్యం నిలకడగా ఉంది. కాగా సకాలంలో సీపీఆర్‌ చేసిన నందవరంహెడ్‌ కానిస్టేబుల్‌ను పలువురు అభినందించారు.

Updated Date - Aug 22 , 2025 | 12:28 AM