వైభవంగా హనుమజ్జయంతి
ABN , Publish Date - May 23 , 2025 | 12:57 AM
డోన పట్టణంలోని ఆంజనేయ స్వామి కొండపై వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
అన్నదానం ఏర్పాటు చేసిన నిర్వాహకులు
డోన రూరల్, మే 22(ఆంధ్రజ్యోతి): డోన పట్టణంలోని ఆంజనేయ స్వామి కొండపై వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ భక్తబృం దం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు చేశారు. అలాగే మండలంలోని వెంకటాపురం, గుమ్మకొండ, చిన్నమల్కాపురం, ఎర్రగుంట్ల తదితర గ్రామాల్లోని ఆలయాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చాగలమర్రి: మండలంలోని మూడురాళ్లపల్లె, శెట్టివీడు గ్రామాల రహదారుల్లోగల అభయాంజనేయస్వామి, చాగలమర్రి వీరాంజనేయ స్వామి ఆలయాల్లో గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో హను మజ్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఆలయాల వద్ద పతాకావిష్కరణ చేశారు. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిం చారు. కోలాట నృత్యం అందరిని ఆకట్టుకుంది. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మండల సంయోజిత కన్వీనర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో మహిళలు సామూహికంగా హనుమాన వ్రతాన్ని నిర్వహించారు.
కన్నులపండువగా హనుమాన శోభాయాత్ర
రుద్రవరం: రుద్రవరంలో కన్నులపండువగా హనుమాన శోభా యాత్ర గురువారం నిర్వహించారు. పడమటి వీధి నుంచి వీధుల గుండా కోలాటం బృందం భక్తిగీతాలతో శోభయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. కోలాట బృందం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే కొండమాయపల్లె, మందలూరు, నక్కలదిన్నె, వాసాపురం, ముత్తలూరు, మెట్ట ఇంకా పలు గ్రామాల్లో జయంతి వేడుకలు నిర్వహించారు.
బేతంచెర్ల: హనుమజ్జయంతిని పురస్కరించుకుని బేతంచెర్ల మండ లంలోని వివిధ గ్రామాలతో పాటు, పట్టణంలో మన ఊరు- మన గుడి, మన బాధ్యత ధార్మిక సంఘం ఆధ్వర్యంలో వీర హనుమాన శోభాయా త్రను అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు. శోభయాత్రల సందర్బంగా గుంటూరు చెందిన సూరయ్య శ్రీరామ్ కళాబృందంతో ఆంజనేయస్వామి వేషాధారణ, మహిళల చేత నిర్వహించిన కోలాటాలు ఆకట్టుకున్నాయి. మన ఊరు - మన గుడి మన బాధ్యత సభ్యులతో పాటు వీహెచపీ సభ్యులు, హిందూ సోదరులు భక్తులు పాల్గొన్నారు. దీంతో వీధులన్నీ శోభాయాత్రలో భక్తులతో కిక్కిరిసాయి.
బనగానపల్లె: పట్టణంలోని కొండపేట, రవ్వలకొండలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాల వద్దకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పూజలు చేశారు. కొండపేట ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్రను అత్యంత శోభాయమానంగా నిర్వహించారు.
అవుకు: మండలంలోని ప్రజలు హనుమజ్జయంతిని ఘనంగా గురువారం జరుపుకొన్నారు. అవుకు పట్టణంలోని కోటవీధి, రాజవీఽఽధి, మార్కెట్ వీధి, సంజీవరాయుడు తోటలో వెలసిన ఆంజనే యస్వామి ఆలయాలతో పాటు, నిచ్చెనమెట్ల, ఉప్పలపాడు గ్రామాల్లో వెలసిన దేవాలయాల్లో అర్చకులు స్వాముల వారికి అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజ కార్యక్రమాలను నిర్వహించారు.
డోన టౌన: డోన పట్టణంలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని పాతపేట, ఇందిరానగర్ ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, కుంకు మార్చనలు, ఆకు పూజలను పురోహితులు చేశారు. అనంరతం విచ్చే సిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదానం ఏర్పాటు చేశారు.
శిరివెళ్ల: మండలంలోని వెంకటాపురం, యర్రగుంట్ల, గుంప్రమా నదిన్నె తదితర గ్రామాల్లో హనుమజ్జయంతి వేడుకలను ప్రజలు గురువారం వైభవంగా జరుపుకొన్నారు. ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రజలు విశేష పూజలు నిర్వహించారు. యర్రగుంట్ల గ్రామంలో విశ్వ హిందూ పరిషత, భజరంగదల్ సంయుక్తంగా శ్రీరామసేన సహకారంతో హనుమాన శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలోని అభయాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలసుబ్రమణ్య శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల మండలంలోని పలు గ్రామాల్లో గురువా రం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమ జ్జయంతి సందర్భంగా కోవెలకుంట్ల పట్టణంతోపాటు వెలగటూరు, గుం జలపాడు, గుల్లదుర్తి, భీమునిపాడు, కలుగొట్ల జోలధరాశి, రేవనూరు, చిన్నగొప్ర్లెర్ల, వల్లంపాడు తదితర గ్రామాల్లో ప్రజలు హనుమజ్జయంతి నిర్వహించారు.