గురుపౌర్ణమి శోభ
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:58 PM
గురుపౌర్ణమి వేడుకలు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
కిటకిటలాడిన దేవాలయాలు
కర్నూలు కల్చరల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): గురుపౌర్ణమి వేడుకలు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. షిరిడీ సాయిబాబా, దత్తాత్రేయ దేవాలయాలు, పుట్టపర్తి సత్యసాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు, మహా మంగళహారతులు, పల్లకీ సేవ, అఖండ సాయి నామ పారాయణలు నిర ్వహించారు. గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించిన సందర్భంగా వ్యాస భగవానుడిని, అలాగే ప్రాచీన యోగాశాస్త్రాన్ని అందించిన పతంజలి మహర్షిని గురుస్థానంలో పూజిస్తూ వీహెచ్‌పీతోపాటు పలు యోగా సంస్థల సభ్యులు తమ తమ గురువులను ఘనంగా సత్కరించారు. కర్నూలు నగరంలోని దక్షిణ షిరిడీ ఆలయానికి భక్తులు పోటెత్తారు.