Share News

గడువు లోపు అర్జీలు పరిష్కరించాలి: జేసీ

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:48 PM

పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య అధికారులను ఆదేశించారు.

గడువు లోపు అర్జీలు పరిష్కరించాలి: జేసీ
అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

కర్నూలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జేసీ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌ లాగిన్‌లో పరిష్కరించిన అర్జీలను ఆడిట్‌ చేయాల్సి ఉందన్నారు. అర్జీల ఆడిట్‌ పెండింగ్‌ లేకుండా చూసుకోవాల న్నారు. పీజీఆర్‌ఎస్‌ లాగిన్‌లో వచ్చిన అర్జీలను అలసత్వం వహించ కుండా పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు చూడాలన్నారు. సీఎంవో గ్రీవెన్స్‌కు సంబంధించి ఆదోని సబ్‌ కలెక్టర్‌ వద్ద 11, కర్నూలు ఆర్డీవో వద్ద 8, పత్తికొండ ఆర్డీవో వద్ద 4, కలెక్టరేట్‌ ఏవో వద్ద 3, సర్వే ఏడీ, విద్యాశాఖ, డీఆర్‌డీఏ పీడీ, ఏపీఐఐసీ జెడ్‌ఎంల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్‌లో ఉన్న వాటిని బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా పరిష్క రించాలని జేసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సి.వెం కటనారాయణమ్మ, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అనూరాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:48 PM