డ్రిప్ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:45 AM
డ్రిప్ పరికరాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించిందని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీడీ ఫిరోజ్ ఖాన్ తెలిపారు.
12 శాతం నుంచి 5 శాతానికి: ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాస్
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): డ్రిప్ పరికరాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించిందని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీడీ ఫిరోజ్ ఖాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సూక్ష్మ సేద్య పథకం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎస్టీ తగ్గుదల వల్ల డ్రిప్ ఏర్పాటు చేసుకోవాలన్న రైతులకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో వివరించారు. ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో డ్రిప్, స్పింకర్ల యూనిట్లను 7వేల హెక్టార్లలో లక్ష్యం చేసుకున్నట్లు తెలిపారు. 5 ఎకరాల్లోపు పొలం ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, పదెకరాల పొలం ఉన్న రైతులకు 90 శాతం రాయితీ, పదెకరాలకు పైబడి ఉన్న రైతులకు 50 శాతం రాయితీ ఉందని తెలిపారు. త్వరితగతిన దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ డ్రిప్ ఏర్పాటు చేసేలా అనుమతి మంజూరు చేస్తున్నట్లు పీడీ శ్రీనివాసులు, ఏపీడీ ఫిరోజ్ ఖాన్ తెలిపారు. ఇప్పటి వరకు 3,245 మంది రైతులు, 4,045 హెక్టార్లకు డ్రిప్‌ను ఏర్పాటు చేసేందుకు రైతులు తమ వాటాను చెల్లించారని తెలిపారు.