జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి కుటుంబాలకు ఊరట
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:18 AM
వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి కుటుంబాలకు ఊరట అని అత్మనిర్బార్ ఎమ్మిగనూర్ నియోజకవర్గం ఇనచార్జ్ గురురాజ్ దేశాయ్, జిల్లా కార్యదర్శి దయాసాగర్ అన్నారు.
ఎమ్మిగనూరు టౌన, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి కుటుంబాలకు ఊరట అని అత్మనిర్బార్ ఎమ్మిగనూర్ నియోజకవర్గం ఇనచార్జ్ గురురాజ్ దేశాయ్, జిల్లా కార్యదర్శి దయాసాగర్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు రెవెన్యూ కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి సోమప్ప సర్కిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మధ్యతరగతి కుటుం బాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందన్నారు. మధ్య తరగతి కుటుంబాలకు దసరా కానుకగా మోదీ జీఎస్టీని తగ్గించి పండుగను వారం రోజులు ముందుగానే తెచ్చారన్నారు. దీని ద్వారా 400 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్ నారాయణ, లలితజైన, చరణ్, శిల్పి భాస్కర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియానలో భాగంగా మైనార్టీ కాలనీలోని అర్బన హెల్త్ సెంటర్‌లో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురురాజ్ దేశాయ్, దయాసాగర్ మాట్లాడుతూ ప్రఽఽధాని నరేంద్ర మోదీ దేశంలోని మహిళల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమానికి నాంది పలికారన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అధికంగా ఉన్నాయి కాబట్టి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబరు 17 నుంచి ఆక్టోబరు 2 వరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కురువ బడేసాబ్, రామన్న గౌడ్, వీరేష్ పాల్గొన్నారు.