Share News

నేడు టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు భూమి పూజ

ABN , Publish Date - May 05 , 2025 | 11:48 PM

ఎమ్మిగనూరు మండలంలోని బసవాసి ఫారం సమీపంలో దాదాపు 77 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్‌ పార్కుకు మంగళవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేయనున్నారు.

నేడు టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు భూమి పూజ
తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఆదోని సబ్‌ కలెక్టర్‌

ఏర్పాట్లను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఎమ్మిగనూరు/ రూరల్‌, మే 5(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మండలంలోని బసవాసి ఫారం సమీపంలో దాదాపు 77 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్‌ పార్కుకు మంగళవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేయనున్నారు. ఏర్పాట్లను ఆదోని సబ్‌కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ సోమవారం పరిశీలిం చారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌, చేనేత జౌళిశాఖ మంత్రి సబిత, రోడ్లు, న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, ‘కుడా’ చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కలెక్టర్‌ రంజిత్‌బాషా, జౌళిశాఖ కమిషనర్‌ రేఖారాణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డితో పాటు జనసేన, బీజేపీ రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు.

Updated Date - May 05 , 2025 | 11:48 PM