Share News

వేరుశనగ రైతు బెంగ

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:25 AM

ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగకు మద్దతు ధర అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఉమ్మడి జిల్లాలోని డోన్‌, పత్తికొండ, పాణ్యం, ఎమ్మిగనూరు, ఆలూరు, తదితర ప్రాంతాల రైతులు శుక్రవారానికి 1215 క్వింటాళ్లను అమ్మకానికి తెచ్చారు.

వేరుశనగ రైతు బెంగ
కర్నూలు మార్కెట్‌కు వచ్చిన వేరుశనగ దిగుబడులు

కనీస మద్దతుధర రూ.7,263 కాగా, వ్యాపారులు ఇచ్చిన ధర రూ.5,909

క్వింటానికి రూ.1,354 నష్టపోతున్న రైతులు

పట్టించుకోని మార్కెట్‌ కమిటీ

కర్నూలు అగ్రికల్చర్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగకు మద్దతు ధర అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఉమ్మడి జిల్లాలోని డోన్‌, పత్తికొండ, పాణ్యం, ఎమ్మిగనూరు, ఆలూరు, తదితర ప్రాంతాల రైతులు శుక్రవారానికి 1215 క్వింటాళ్లను అమ్మకానికి తెచ్చారు.

వ్యాపారుల సిండికేట్‌

మార్కెట్‌కు వేరుశనగ రావడంతో వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. గరిష్ట రూ.5,909లు, మధ్యస్థ ధర రూ.5,459లు, కనిష్ట ధర రూ.5,829లు మాత్రమే ధర పలకడంతో రైతులు ఆగ్రహావేశాలకు గుర య్యారు. కేంద్ర ప్రభుత్వం క్వింటానికి రూ.7,263ను మద్దతు ధరగా నిర్ణయించగా ఇక్కడ మాత్రం దాదాపు రూ.1354లు తగ్గించడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ కమిటీ అధికారులు కార్యాలయానికే పరిమితం అవుతూ తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ధర ప్రకారం విక్రయిస్తే తవ్రంగా నష్టపోయి అప్పులపాలు అవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, మద్దరు ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు

Updated Date - Oct 18 , 2025 | 12:25 AM