రుణాలు మంజూరు చేయండి
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:17 PM
రైతులకు ఆదాయం పెరిగేలా పాడి పరిశ్రమ, అనుబంధ రంగాలకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ సిరి బ్యాంకర్లను సూచించారు.
కలెక్టర్ సిరి
బ్యాంకర్లతో సమావేశం
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఆదాయం పెరిగేలా పాడి పరిశ్రమ, అనుబంధ రంగాలకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ సిరి బ్యాంకర్లను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్లకు సంబంధించిన రెండో త్రైమాసిక డీసీసీడీఎల్‌ఆర్‌సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల జీవ నోపాధిని బలోపేతం చేయడానికి ముఖ్యంగా లైవ్ స్టాక్ సంబంధిత రుణాలను విస్తృతంగా ఇవ్వాలని సూచించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్‌ఐ 2025-26) కర్నూలు జిల్లాకు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.17,402.86కోట్లు కాగా 30.09.2025 నాటికి సాధన రూ.12,685.90 కోట్లు (72.90 శాతం) సాధించామన్నారు. కెనరా బ్యాంకు రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్, ఏపీజీబీ రీజనల్ మేనేజర్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ కింద రోగులకు మెరుగైన వైద్యసేవ లందించాలని కలెక్టర్ సిరి నెట్‌వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్యసేవకు సంబంధించి ప్రైవేటు నెట్ వర్క్ ఆసుపత్రుల యాజ మాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యసేవ కింద రోగులకు ఉచితంగా వైద్యం అందించే పథకమని, రోగుల నుంచి డబ్బులు తీసుకోవడం సముచితం కాదన్నారు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.