జిల్లా గ్రంథాలయ సంస్థను సందర్శించిన గాడిచర్ల మనువడు
ABN , Publish Date - May 18 , 2025 | 12:56 AM
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, మహాత్మాగాంధీ అనుచరుడు గాడిచర్ల హరిసర్వోత ్తమరావు మనువడు ఎంసీ మోహనకృష్ణ శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థను సందర్శించారు.
కర్నూలు కల్చరల్, మే 17(ఆంధ్రజ్యోతి): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, మహాత్మాగాంధీ అనుచరుడు గాడిచర్ల హరిసర్వోత ్తమరావు మనువడు ఎంసీ మోహనకృష్ణ శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థను సందర్శించారు. ఆయనతోపాటూ ద్రవిడ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.దొరస్వామి నాయుడు, ఎస్‌వీయూ ఆచార్యులు డాక్టర్ కె. సురేంద్రబాబు, రాష్ట్ర గ్రంథాలయ శిక్షణాలయం కార్యదర్శి రావి శారద, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మనోహర్‌రావు విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ప్రకాశ, ఉప గ్రంథాలయ అధికారి వి.పెద్దక్క సాదరంగా ఆహ్వానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలోని గాడిచర్ల విగ్రహానికి, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన గాడిచర్ల చిత్రపటానికి వారు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారిని శాలువతో సత్క రించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ పూర్వ అధ్యక్షుడు కేసీ కల్కూర, కేజీ గంగాధరరెడ్డి, లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, ఎస్.బాషా, మగ్బుల్ బాషా, విద్యావేత్తలు చంద్రశేఖర్, లక్ష్మీరెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.