ఘనంగా స్వాతి సుదర్శన హోమం
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:31 AM
అహోబిలంలో ఆదివారం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు.
ఆళ్లగడ్డ జూన్ 8(ఆంద్రజ్యోతి): అహోబిలంలో ఆదివారం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో ఆలయ ఆవ రణలో సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం రక్షా కంకణాలను భక్తులకు వితరణ చేశారు. ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అలాగే నవ నరసింహ సన్నిధికి భక్తులు నడిచి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. స్వాతి సందర్భంగా వచ్చిన భక్తులకు దేవస్థానం, సత్రాల నిర్వాహ కులు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.