వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:17 PM
శ్రీశైల దేవస్థానంలోని చంద్రావతి కల్యాణ మండపంలో ధర్మప్రచారంలో భాగంగా శ్రావణమాసం శుక్రవారం సామూహికంగా వరలక్ష్మీవ్రతం నిర్వహించారు.
నంద్యాల కల్చరల్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానంలోని చంద్రావతి కల్యాణ మండపంలో ధర్మప్రచారంలో భాగంగా శ్రావణమాసం శుక్రవారం సామూహికంగా వరలక్ష్మీవ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలోని 90 చెంచుగూడాలకు చెందిన గిరిజన భక్తులను ఆహ్వానించారు. చెంచు గిరిజన భక్తులు 650మంది, ఇతర భక్తులు 950మందికి పైగా పాల్గొన్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస రావు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అర్చకులు, ఆలయ సిబ్బంది, స్దానికి ఐటీడీఏ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.