Share News

ఘనంగా జయతీర్థుల ఆరాధనోత్సవాలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:54 PM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పూర్వపు గురువులు జయతీర్థుల ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా జయతీర్థుల ఆరాధనోత్సవాలు
బంగారు రథానికి పూజలు చేస్తున్న పీఠాధిపతి

బంగారు రథంపై ఊరేగించి ప్రత్యేక పూజలు

మంత్రాలయం, జూలై 15(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పూర్వపు గురువులు జయతీర్థుల ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం శ్రీమఠంలో జయతీర్థుల బృందావన చిత్రపటా నికి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపం డితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య బృందా వన చిత్రపటానికి నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం నిర్వహించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు, పట్టు వస్ర్తాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి చిత్రపటాన్ని బంగారు రథంపై అధిష్టించి సుబుధేంద్ర తీర్థులు మహా మంగళహారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణం చుట్టూ అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఊంజల మంటపంలో వెండి ఊయలలో స్వామివారిని ఉంచి పూజలు చేశారు. పీఠాధిపతి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పండితులచే జయతీర్థుల విజయ గాఽథలపై ప్రవచనాలు చేశారు. పూర్ణభోధ పూజా మందిరంలో సంస్థాన పూజలో భాగంగా మూలరాములకు విశేషంగా బంగారు ఆభరణా లతో అభిషేకం చేశారు. ఈపూజలను కన్నులారా తిలకించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. వేలాది మంది పాల్గొన్న భక్తులకు పీఠాధిపతి శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదిం చారు. కార్యక్రమంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్‌ఆచార్‌, పవన్‌ ఆచర్‌, విజయేంద్రాచార్‌, ఆనందతీర్థ ఆచార్‌, గౌతమ్‌ ఆచార్‌, గోపాలకృష్ణస్వామి, వరధేంద్రాచార్‌ పెద్ద ఎత్తున భక్తులు పాల్గ్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:54 PM