Share News

8 నుంచి ధాన్యం కొనుగోలు

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:42 PM

కర్నూలు మార్కెట్‌యార్డులోని మాధవాచారి ప్లాట్‌ఫారాల వద్ద ఈనెల 8వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలెక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ జయలక్ష్మి అన్నారు.

8 నుంచి ధాన్యం కొనుగోలు
సమావేశం నిర్వహిస్తున్న సెక్రటరీ జయలక్ష్మి

మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ జయలక్ష్మి

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌యార్డులోని మాధవాచారి ప్లాట్‌ఫారాల వద్ద ఈనెల 8వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలెక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ జయలక్ష్మి అన్నారు. శుక్రవారం మిల్లర్లు, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తెచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందించేందుకు సహకరించాలన్నారు. కొనుగోళ్ల కోసం తాము అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు నగేష్‌, శివన్న, అకౌంటెంట్లు కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:42 PM