Share News

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:13 AM

ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి, ఎంఈవో ప్రభాకర్‌ సూచించారు.

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
మాట్లాడుతున్న డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి

డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి

డోన టౌన, జూన 24(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి, ఎంఈవో ప్రభాకర్‌ సూచించారు. మంగళవారం స్థానిక ఎంఆర్‌సీ కార్యాలయంలో ప్రైవేటు స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో సమయపాలన పాటించాలన్నారు. ప్రతి స్కూల్‌లో నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు ఉంచాలన్నారు. పాఠశాల ఆవరణంలో బుక్స్‌, యూనిఫామ్స్‌, బెల్టులు విక్రయించకూడదని తెలిపారు. ప్రభుత్వ సెలవుల్లో పాఠశాలలు నడపరాదన్నారు. అన్ని పాఠశాలల యజామాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. గత మూడేళ్ల నుంచి ఆర్‌టీఈ 12(1)సీ కింద స్కెప్ట్‌ అయిన విద్యార్థుల వివరాలను ఫాలోప్‌ చేసి పంపించాలన్నారు. ఈ సమావేశంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:13 AM