Share News

రెడ్‌క్రాస్‌ సొసైటీ ÿCజిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ గోవిందరెడ్డి

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:27 AM

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ కేజీ గోవిందరెడ్డి మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కమిటీ కాలపరిమితి ఈ నెల 15వ తేదీ ముగియనున్న నేపథ్యంలో నూతన కమిటీని ఎన్నుకునేందుకు శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సభ్యుల సమావేశం నిర్వహించారు.

రెడ్‌క్రాస్‌ సొసైటీ ÿCజిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ గోవిందరెడ్డి
చైర్మన్‌ డాక్టర్‌ గోవిందరెడ్డితో వైస్‌ చైర్‌పర్సన్‌ అరుణ, సభ్యులు

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ కేజీ గోవిందరెడ్డి మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కమిటీ కాలపరిమితి ఈ నెల 15వ తేదీ ముగియనున్న నేపథ్యంలో నూతన కమిటీని ఎన్నుకునేందుకు శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సభ్యుల సమావేశం నిర్వహించారు. 7వేల మంది సభ్యులు ఉండగా.. 400 మంది సభ్యులు హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారిణి సి.వెంకట నారాయణమ్మ అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్‌పర్సన్‌గా డీఎంహెచ్‌వో కార్యాలయ ఏవో కె.అరుణ, కోశాధికారిగా నరసింహ, మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా జి.శ్రీనివాసులు, ప్రభాకర్‌ రెడ్డి, రఘునాథరెడ్డి, బాబురాజ్‌, డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి, భీమశంకర్‌ రెడ్డి, ఎన్వీ సుబ్బారెడ్డి, మీనాక్షి ఎన్నికయ్యారు. ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులతో డీఆర్వో ప్రమాణ స్వీకారం చేయించారు.

‘వంద మంది సభ్యులతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?’

ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కర్నూలు జిల్లాలో 7వేల మంది సభ్యులు ఉన్నారని, అయితే వంద మంది సభ్యులతో జిల్లా కమిటీకి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని రెడ్‌ క్రాస్‌ సొసైటీ గత మేనేజింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న ఐ.విజయకుమార్‌ రెడ్డి ఓప్రకటనలో ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా వేయాలని కలెక్టర్‌, డీఆర్వోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మేనేజింగ్‌ కమిటీలో 17మంది ఉండగా.. 11 మందిని తనకు అనుకూలమైన సభ్యు లను తీసుకుని ప్రశ్నించే సభ్యులను తొలగించారని ఆయన ఆరోపిం చారు. ఎన్నికలు నిబంధనల ప్రకారం జరగాయని, ఈ సమావేశానికి 400 మంది సభ్యులు హాజరయ్యారని రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ గోవిందరెడ్డి తెలిపారు.

Updated Date - Sep 14 , 2025 | 12:27 AM