ప్రభుత్వాల పనితీరు బాగుంది
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:28 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, పనితీరు బాగుందని కేంద్ర ప్రభారీ ఆఫీసర్, ఐవోఎ్‌సఎస్ డైరెక్టర్ యూత్ అఫేర్స్ అధికారి పి.బంగారీ రాజు అన్నారు. మంగళవారం నీతి అయోగ్‌లో భాగంగా మండలంలోని పెరవలిలో ప్రసిద్ధ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు.
కేంద్ర ప్రభారీ ఆఫీసర్ పి.బంగారీ రాజు
మద్దికెర, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, పనితీరు బాగుందని కేంద్ర ప్రభారీ ఆఫీసర్, ఐవోఎ్‌సఎస్ డైరెక్టర్ యూత్ అఫేర్స్ అధికారి పి.బంగారీ రాజు అన్నారు. మంగళవారం నీతి అయోగ్‌లో భాగంగా మండలంలోని పెరవలిలో ప్రసిద్ధ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూ జలు చేయించి వారికి శాలువ కప్పి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆ అధికారి పెరవలిలోని వెల్‌నెస్ సెంటర్‌ను పరిశీలించారు. మద్దికెరలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి రోగులకు ఎలా సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మఽధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా పరిశీలించి భోజనం ఎలా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని అన్ని శాఖల అధికారుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. వైద్యసేవలు కూడా ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచాలన్నారు. అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో రామచంద్రారెడ్డి, తహసీల్దార్ గూండాల్ నాయక్, ఎంపీడీవో కొండయ్య, ఎంఈవో రంగస్వామి, పంచాయతీ కార్యదర్శి సుదాకర్, ఏపీవో నర్సిరెడ్డి, వివిద శాఖ అధికారులు పాల్గొన్నారు.