విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:17 AM
విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా
48 మందికి జిల్లా స్థాయి ఉత్తమ అవార్డుల ప్రదానం
నంద్యాల ఎడ్యుకేషన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రితో పాటు కలెక్టర్ రాజకుమారి, డీఈవో జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వారు జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని అందుకు అనుగుణంగా విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేలా ప్రతి టీచర్ అంకితభావంతో పనిచేయాలన్నారు. తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పథకాలను ప్రభుత్వం అ మలు చేస్తోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్ వంటివి ప్రతి స్కూలు లో ఉండడంతో చదువుతో పాటు లీడర్‌షిప్ క్వాలిటీ పెరుగుతుందన్నారు. ప్రతిస్కూల్‌లో గోడలపై మంచి సూక్తులు రాయించాలని సూచించారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 48 మందికి అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు.