Share News

స్వచ్ఛాంధ్రకు ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:51 AM

పరిశుభ్రమైన పచ్చదనం, ఆరోగ్యవంతమైన స్వచ్ఛాంధ్ర టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

స్వచ్ఛాంధ్రకు ప్రభుత్వం కృషి
స్వచ్ఛ దివస్‌ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే, అధికారులు, విద్యార్థులు

స్వచ్ఛ దివస్‌ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు,ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రమైన పచ్చదనం, ఆరోగ్యవంతమైన స్వచ్ఛాంధ్ర టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. మూడో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్‌ ర్యాలీని ఎమ్మెల్యే బీవీ ప్రారంభించారు. ర్యాలీ మున్సిపల్‌ కార్యాల యం నుంచి గాంధీ సర్కిల్‌ వరకు సాగింది. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి, డీఈఈ నీరజ, ఏఈలు మధన, శరత, కౌన్సిలర్లు రామదాసు గౌడ్‌, వాహీద్‌, అమాన, ఇసాక్‌, నాయకులు రామకృష్ణ నాయుడు, నజీర్‌, ర ంగస్వామి గౌడ్‌, బుగిడే నాగరాజులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు టౌన: ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ కె విజయరాణి ఆధ్వర్యంలో విద్యార్థి నులు స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివస్‌ నిర్వహించారు. ఎనఎస్‌ఎస్‌ విద్యార్థులు కళాశాల ఆవరణలో పరిసరాలను శుభ్రపరచి, మొక్కలకు నీరు పోశారు. కార్యక్రమంలో పద్మావతి, లక్ష్మీ, స్రవంతి సిబ్బంది పాల్గొన్నారు.

కోసిగి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్ర మం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడమే లక్ష్యమని టీడీపీ మంత్రాలయం ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. శనివారం కోసిగి మేజర్‌ గ్రామ సర్పంచ కుమారి సంజిపోగు అయ్యమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోసిగిలోని స్టేట్‌ బ్యాంకు మెయిన రోడ్డుపై ఉన్న మొబైల్‌ షాపుల నుంచి ఈ-వ్యర్థాలను సేకరించారు. అనంతరం తేరుబజారులో ఉన్న చెత్తాచెదారాన్ని అధికారులు, మండల టీడీపీ నాయకులతో కలిసి చీపుర్లు పట్టి శుభ్రం చేశారు. అధికారులతో కలిసి రాఘవేంద్ర రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ హనుమంతరెడ్డి, ఈవోపీఆర్‌డీ హరూనరషీద్‌, ఈవో తిరుమలేశ్వరరెడ్డి, ఏపీఎం సత్యమ్మ, ఏపీవో ఖాలిక్‌, టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, వక్రాణి వెంకటేశ, జ్ఞానేష్‌, తోవి రామ కృష్ణ, నాడిగేని అయ్యన్న, సాతనూరు కోసిగయ్య, మాణిక్యరాజు, చింతల గేని నర్సారెడ్డి పాల్గొన్నారు.

పెద్దకడుబూరు: ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని ఎంపీపీ బాపురం శ్రీవిద్య అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్ద కడుబూరులో సర్పంచ రామాంజనేయులు అధ్యక్షతన స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఇనచార్జి ఎంపీడీవో జయరాముడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, వైసీపీ నాయకులు రామ్మోహనరెడ్డి, ఉప సర్పంచ విజయేంద్ర, హౌసింగ్‌ ఏఈ నాగన్న, బీసీ సెల్‌ నాయకులు అంజి పాల్గొన్నారు.

గోనెగండ్ల: ఈ-వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలుగుతోందని ఎంపీడీవో మణిమంజరి, ఈవోఆర్‌డీ అనంతశయన, కార్యదర్శి సతీష్‌ అ న్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కింద పంచాయతీ కార్యాల యం ఎదుట ఈ-వ్యర్థాల సేకరణను అధికారులు చేపట్టారు.

Updated Date - Apr 20 , 2025 | 12:51 AM