నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:47 AM
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత
కల్లూరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం 30వ వార్డు శరీననగర్‌లో నాయీబ్రాహ్మణులు త్యాగరాజ మందిరంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సభలో ఆమె పాల్గొని మా ట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుతను సీఎం చంద్రబాబు అమలు చేశారన్నారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దనరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన వై.నాగేశ్వ రరావు యాదవ్, జనసేన అధ్యక్షుడు చింతాసురేష్, నాయీ బ్రాహ్మణ కార్పొ రేషన డైరెక్టర్ విజయ్‌కుమార్, వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ మంజునాథ్, నంద్యాల పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, మాజీ ఎంపీపీ వాకిటి మాధవి, కార్పొరేటర్ జయరాం, శైలజాయాదవ్, ఎన్వీ. రామకృష్ణ, పుల్లయ్యగౌడ్, శ్రీనివాసరావు, మద్దయ్య పాల్గొన్నారు.